ఈసారి బాలాకోట్ దాటి వెళ్లి మరీ దాడులు చేస్తాం - ఆర్మీ చీఫ్

బాలాకోట్ రీ ఓపెన్‌పై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీ పర్యవేక్షణలో ఉగ్రవాద స్థావరాలు యాక్టివేట్ అయ్యా యని మండిపడ్డారు. ఈసారి పాక్ పిచ్చి పిచ్చి చర్యలకు పాల్పడితే బాలాకోట్ దాటి వెళ్లి మరీ దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘ టనపై యావత్‌దేశం రగిలిపోయింది. ఉగ్ర ఘాతుకానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని భారతీయులు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో ఫిబ్రవరి 26న భారత వాయుసేన ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. బాలాకోట్ సహా 3 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఆ దాడుల్లో బాలాకోట్ టెర్రరిస్ట్ క్యాంపు సర్వనాశనమైంది. దాంతో అక్కడి నుంచి టెర్రరిస్టులు బిచాణా ఎత్తేశారు. కశ్మీర్ విభజన నేపథ్యంలో ఉగ్రవాదులు మళ్లీ యాక్టివ్ అయ్యారు. 7 నెలల తర్వాత బాలాకోట్‌లో మళ్లీ మకాం వేశారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com