భార్య ఇంట్లో లేని సమయంలో మరదలిపై..
భార్యకు తోడుగా ఉండటానికి వచ్చిన మరదలిపై కన్నేసిన ఓ నీచుడు.. దారుణానికి యత్నించాడు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో సపర్యలు చేసేందుకు మరదలు వచ్చింది. ఆమెను లొంగదీసుకుని తన కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు ఆ దుర్మార్గుడు. అందుకు ఆమె నిరాకరించడంతో అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తన చెల్లిలి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన భర్తను కటకటాల వెనక్కు పంపించింది. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
భాగల్‌పూర్ పట్టణంలో ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. ఆమె చెల్లి వచ్చి తోడుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరదలిపై కన్నేసిన ఆ కామాంధుడు.. కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు ఇంట్లోనే అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా భార్య అడ్డుకుంది. శనివారం అతడి భార్య పని నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఆమె చెల్లి ఒంటరిగా ఉంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ నీచుడు.. తలుపులు గడియపెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. వదిలేయాలని బాధితురాలు ప్రాథేయపడినా వినలేదు. అదే సమయంలో తిరిగొచ్చిన ఆమె అక్క ఇంట్లో నుంచి వస్తున్న కేకలు విని స్థానికులను అప్రమత్తం చేసింది. తలుపులు పగులగొట్టి భర్తను చితకబాదింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com