నీటిలోకి దిగి పెళ్లి ప్రపోజల్.. ఊపిరి ఆడక.. వీడియో..

ప్రేమించిన ప్రియురాలికి వెరైటీగా పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. నీళ్లలో దిగి ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పింది. కానీ అంతలోని అతడికి ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో జరిగింది. ప్రేమ జంట స్టీవెన్, కెనసాలు.. రెండ్రోజులు ఎంజాయ్ చేద్దామని నీటిపై తేలియాడే హోటల్‌కి వెళ్లారు. కెనసాను రూమ్‌లో ఉండమని చెప్పి స్టీవెన్ నీటిలో దిగాడు. నీకో సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి వెళ్లాడు. నీటిలో తేలియాడుతూ జేబులో నుంచి ఓ లవ్ లెటర్ తీసాడు. నీలో నాకు నచ్చిన విషయాలన్నీ చెప్పాలంటే అంత సేపు ఊపిరి బిగబట్టి ఉండలేను. కానీ నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా. నాతో జీవితాన్ని పంచుకుంటావా? అని లేఖలో రాశాడు. నువ్వు ఓకే అంటే నీ వేలికి ఈ ఉంగరం పెడతానంటూ జేబులో నుంచి ఉంగరం ఉన్న బాక్స్ తీసి చూపించాడు.
ఆమె ఓకే చెప్పేలోపే.. స్టీవెన్ అంత సేపు నీటిలో ఊపిరి బిగబట్టి ఉండడం వల్ల స్పృహ కోల్పోయాడు. కెనసా తన ప్రియుడిని రక్షించడానికి పరుగున అద్దాల గది నుంచి బయటకు వచ్చింది. అయినా లాభం లేకపోయింది అప్పటికే స్టీవెన్ ప్రాణాలు కోల్పోయాడు. జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్న ఆ ప్రేమ జంటను విధి విచిత్రంగా విడదీసింది. ఆమె ఒంటరిగా రోదిస్తూ తన మనసులోని భావోద్వేగాన్ని అక్షర రూపంలో వ్యక్తీకరించింది. నేను చెప్పిన సమాధానం నువ్వు వినలేదు స్టీవెన్.. నీ ప్రపోజల్‌కు నేను యెస్ చెప్పాను. నువ్వు నీటి నుంచి బయటకు వచ్చాక నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. కానీ విధి ఊహించని విధంగా నిన్ను నా నుంచి దూరం చేసింది. మళ్లీ జన్మ వుంటే నువ్వే నా భర్త కావాలని కోరుకుంటా అని తన ఆవేదనను లేఖలో రాసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com