బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు యువకులు ..

బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు యువకులు ..

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం జట్టిగుండ్లపల్లిలో దారుణం జరిగింది. ఓ మైనర్‌ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నెల 10న జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది.

14 ఏళ్ల బాలికను హరి, రాజులతోపాటు మరో యువకుడు కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తల్లికి చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు దుర్మార్గులు. అవమానంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. చావుబతుకుల మధ్య ఉన్న ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story