నగల షోరూంలో దోపిడీకి స్కెచ్.. అడ్డుకున్న ఎస్సైని..

హైదరాబాద్ శివార్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్ షోరూంలో దోపిడీకి దొంగలు స్కెచ్ వేయగా.. దుండిగల్ ఎస్సై అడ్డుకున్నారు. స్పాట్‌కు వచ్చిన ఎస్సై శేఖర్‌రెడ్డిని.. తమ వెహికల్‌తో ఢీ కొట్టి.. హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. దొంగల బారి నుంచి దుండిగల్ ఎస్సై.. చాకచక్యంగా తప్పించుకున్నారు.
దోపిడీ దొంగలు తనపై హత్యాయత్నం చేసినా ఎస్సై శేఖర్‌రెడ్డి ఏమాత్రం భయపడలేదు. వెంటనే వారిని వెంబడించారు. సినీ ఫక్కీలో ఛేజింగ్ సీన్ జరిగింది. దొంగలు దూలపల్లి అడవుల్లోకి పారిపోయారు. వాళ్లు వాడిన వాహనం, కట్టర్, షట్టర్లు తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దోపిడీ దొంగలు వాడిన వాహనం.. ఆల్వాల్‌లో దొంగిలించినదిగా పోలీసులు గుర్తించారు. వాళ్లు అంతకుముందు.. రెండు ఏటీఎంలను దోచుకునేందుకు విఫల ప్రయత్నం చేశారని తేల్చారు. దూలపల్లి అటవీ ప్రాంతంలోకి పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com