తప్పుడు నిర్ణయమేనని పరోక్షంగా ఒప్పుకున్న కోహ్లీ

సొంత గడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఆదివారం జరిగిన చివరి టీ20లో సఫారీలు విజయం సాధించడంతో సీరిస్ సమం అయ్యింది. దీంతో చివరి టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఛేజింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. విమర్శలపై స్పందించిన కోహ్లీ.. తమది తప్పుడు నిర్ణయమేనని పరోక్షంగా ఒప్పుకున్నాడు.
గేమ్ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయామన్నారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడం తమకు అనుకూలించలేదన్నారు. కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు ఫలితాలనివ్వవన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతోనే ఓటమి పాలయ్యమన్న విషయాన్ని కాదనలేమన్నారు. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యామని.. మరో మ్యాచ్‌లో ఇలాంటిది పునరావృతం చేయమన్నారు కోహ్లీ.
దక్షిణాఫ్రికా సమిష్టి ప్రదర్శనపై కోహ్లి ప్రశంసలు కురిపించారు. ఆ జట్టులో ప‍్రతీ ఒక్కరూ ఆకట్టకోవడంతో మేము మ్యాచ్‌ను సులభంగా కోల్పోయామని.. ముఖ్యంగా మమ్మల్ని సాధారణ పరుగులకే కట్టడి చేసిన సఫారీ బౌలర్లకే మొత్తం క్రెడిట్ దక్కుతుందన్నారు. తాము ప్రస్తుతం యువ క్రికెటర్ల సత్తాను పరీక్షిస్తున్నామని.. అందులో భాగంగానే పలువురికి అవకాశాలు ఇస్తున్నామన్నారు.
Also watch :
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com