నాతో పెళ్లికి ప్రయత్నించు : అభిమానికి కాజల్ షాక్..

నాతో పెళ్లికి ప్రయత్నించు : అభిమానికి కాజల్ షాక్..

వరుస ప్లాపులతో ఇబ్బందిపడ్డ కాజల్ తాజా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమిళంలో జయంరవితో చేసిన 'కోమలి' చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో కాజల్‌ అగర్వాల్‌ ఆనందానికి అవధుల్లేవు. కొద్దిరోజులుగా కాజల్ ను ప్లాపులు వెంటాడుతున్న తరుణంలో ఈ సక్సెస్ మంచి కిక్కించింది. దాంతో వెర్రి ఆనందంలో ఉన్న కాజల్ ఈ విజయాన్ని తన అభిమానులతో పంచుకుంది. చాలా రోజుల తరువాత మంచి సక్సెస్ సాధించినందుకు ఆనందంగా ఉందని ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నానని అమ్మడు ట్విట్టర్ చాటింగ్ లోకి వచ్చింది. అయితే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న చందంగా..

అభిమానులందు వీరాభిమానులు వేరయా అని ఓ అభిమాని నిరూపించాడు. కాజల్ కు అభిమానులందరూ శుభాకాంక్షలు చెబుతుండగా అతను మాత్రం.. 'నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాను' అని పేర్కొన్నాడు. దాంతో అవాక్కయిన కాజల్ కొద్దిసేపటి తరువాత తేరుకొని. 'ప్రయత్నించండి అయితే అది అంత సులభమైన విషయం కాదు' అని బదులిచ్చింది. దాంతో సంబరపడిపోయిన ఆ అభిమాని వెంటనే ప్రయత్నిస్తూనే ఉన్నాను అని మళ్ళీ మెసేజ్ పెట్టాడు. అయితే సెలబ్రిటీలకు ఇటవంటి ఘటనలు కొత్తేమి కాదని కాజల్ లైట్ తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story