సాయి పల్లవికి వరుణ్ ఫిదా.. అవకాశం వస్తే ఆమెని..

సాయి పల్లవికి వరుణ్ ఫిదా.. అవకాశం వస్తే ఆమెని..

అయ్ బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే అంటూ వరుణ్ తేజ్‌తో, సాయి పల్లవి ఆడి పాడి హిట్ కొట్టిన చిత్రం ఫిదా. అందులో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు వరుణ్‌ కూడా ఆమెకు ఫిదా అయ్యానంటున్నాడు. మంచు లక్ష్మి Voot అనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో వరుణ్ తేజ్‌ను ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా.. వరుణ్‌ని ఇప్పటి వరకు నటించిన హీరోయిన్స్ గురించి చెప్పమంటే.. ఒక్కొక్కరి గురించి ఒక్కో రకంగా స్పందించాడు. ముందుగా సాయి పల్లవి గురించి చెబుతూ.. అవకాశం వస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇక గద్దలకొండ గణేష్‌గా మరోసారి హిట్ అందుకున్న వరుణ్ అందులో నటించిన పూజా హెగ్డేతో డేటింగ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. మరో చిత్రంలో తనతో పాటు నటించిన రాశీఖన్నా గురించి చెబుతూ.. ఆమెను చంపేయాలనుంది అంటూ సరదాగా సమాధానం చెప్పాడు. మంచి కాంప్లిమెంట్స్ మాత్రం సాయిపల్లవికే అందాయి. మరి వరుణ్‌కి అంతగా నచ్చేసింది ఆమె.

Tags

Read MoreRead Less
Next Story