అంతర్జాతీయం

70 ఏళ్లలో చేయలేని పని 70 రోజుల్లో చేశాం : ప్రధాని మోదీ

70 ఏళ్లలో చేయలేని పని 70 రోజుల్లో చేశాం : ప్రధాని మోదీ
X

పంచ్‌ డైలాగులు, భవిష్యత్‌ లక్ష్యాలు, గత ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ప్రధాని మోదీ తనదైన స్టైల్‌ ఎన్‌ఆర్జీ స్టేడియంలో తమ ప్రభుత్వ సత్తాను చాటిచెప్పారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు ఎన్‌ఆర్జీ స్టేడియం గ్యాలరీలు నమో మంత్రంతో మార్మోగిపోయాయి. భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నా భారతీయత స్పూర్తి అందర్ని ఏకం చేస్తుందని మన దేశ విశిష్టతను చాటిచెప్పారు. అనేక సంస్కృతులు...ఒకే దేశం మా విధానం అన్నారు మోదీ

బీజేపీ ప్రభుత్వం సాధించింది ఏమి లేదన్న వ్యతిరేక వర్గానికి గణాంకాలతో సహా ఛాలెంజ్ విసిరారు మోదీ. ఐదేళ్లలో 60 ఏళ్ల చరిత్రను తిరగరాశామని అన్నారు. తమ పాలన సాధించిన ప్రగతి, తమ ప్రభుత్వ విజన్‌ ను వివరించారు. స్వచ్ఛ భారత్‌ తో గ్రామాల రూపురేఖలు మార్చామని అన్నారు. తమ పాలనలో భారత్‌ 5 ట్రిలియలన్‌ ల ఆర్ధిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు. సబ్ కా సాత్‌..సబ్‌ కా వికాస్ తో ప్రతీ భారతీయుడి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా విజన్‌తో పనిచేస్తున్నామని అన్నారు మోదీ.

ఆరు దశబాద్దాల తర్వాత అత్యంత బలమైన ప్రభుత్వం ఏర్పడిందన్న ప్రధాని..గత ఎన్నికల్లో ఫుల్‌ మెజారిటీతో మరింత బలమైన ప్రభుత్వంగా మారిందన్నారు. నవ నిర్మాణం కోసం గాంధీ జయంతి సందర్భంగా దేశానికి కీడు కలిగించే అన్నింటికి ఫేర్‌ వెల్‌ చెప్పామని అన్నారు. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి చెప్పాలన్నారు. అవినీతికి ఫేర్‌ వెల్‌ చెప్పాలన్నారు.

ఒకే దేశం ఒకే రాజ్యాంగం అని నమ్మే తమ ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌ అభివృద్దికి అవరోధంగా మారిన ఆర్టికల్‌ 370ని రద్దు చేసిందని మోదీ గుర్తు చేశారు. 70 ఏళ్లలో చేయలేని పనిని తాము 70 రోజుల్లో చేసి చూపించామని అన్నారు.

తమ పాలనలో ప్రభుత్వ సేవలన్ని సులభతరం అయ్యాయని అన్నారు మోదీ. గతంలో రెండు మూడు నెలలు పట్టే పాస్‌ పోర్టు మంజూరు ప్రక్రియ ఇప్పుడు వారంలో పూర్తి అవుతుందన్నారు. కంపెనీల అనుమతులు మరింత సులభతరం చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10వేలకుపైగా సర్వీసులను ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు.

Next Story

RELATED STORIES