పీవీ సింధు కోచ్‌ రాజీనామా

పీవీ సింధు కోచ్‌ రాజీనామా

భారత షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇందుకు ముఖ్యపాత్ర పోషించిన సింధు మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. దక్షిణ కొరియాకు చెందిన జి హ్యున్.. సింధుకు నాలుగు నెలలు మాత్రమే కోచ్ గా సేవలందించారు. వ్యక్తిగత కారణాలతో కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా హ్యున్ భర్త కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సర్జరీ అయినట్టు తెలుస్తోంది. దీంతో అతనికి ఆరు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఈ ఆరు నెలల పాటు భర్త బాగోగులను చూసుకునేందుకు హ్యున్ వెళ్లారు. ఆమె తిరిగి వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే సింధు వరల్డ్ ఛాంపియన్‌గా మారడంలో హ్యున్ ముఖ్య పాత్ర పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story