ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ..

ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ..

ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనే వారికి ఈ ర్యాలీ ఉపయుక్తంగా ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి 25 వరకు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని 125 ఇన్‌ఫాంట్రి బెటాలియన్ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. టెర్రిటోరియల్ ఆర్మీలో సోల్జర్ (జనరల్ డ్యూటీ), క్లర్క్, షెఫ్ కమ్యూనిటీ, షెఫ్ స్పెషల్, హెయిర్ డ్రెస్సర్, ఈ ఆర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, గోవా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దాదర్ నగర్ హవేలీ, డామన్ & డయ్యు, లక్షద్వీప్, పాండిచ్చేరి అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనొచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

సికింద్రాబాద్ సెంటర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 7. విద్యార్హత: సోల్జర్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు 10 వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 45% మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో 33% మార్కులు తప్పనిసరి. లేదా 12వ తరగతి పాసై ఉండాలి. ట్రేడ్స్ మ్యాన్ పోస్టుకు 10వ తరగతి, క్లర్క్ పోస్టుకు 60% మార్కులతో 10+2 పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్టులో 50 % మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతి 77 సెంటీమీటర్లు, బరువు 50 కిలోలు ఉండాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రింట్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌తో పాటు ఆధార్ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకుని రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వెళ్లాలి. ఇవి లేకపోతే ఫిజికల్ టెస్టుకు అనుమతించరు.

Tags

Read MoreRead Less
Next Story