దొంగ.. ఉల్లిపాయలు దోచుకుపోయాడు.. యజమాని కన్నీళ్లు

దొంగ.. ఉల్లిపాయలు దోచుకుపోయాడు.. యజమాని కన్నీళ్లు
X

అయ్యో.. మా ఆవిడ మెళ్లో గొలుసో.. నా చేతి రింగో పట్టుకుపోయాడు కాదు దొంగ వెధవ.. గోడౌన్లో ఉల్లి పాయలన్నీ దోచుకు పోయాడు.. అని లబో దిబో మంటున్నాడు బీహార్ రాజధానికి పాట్నాకు చెందిన వ్యక్తి. అసలే కిలో రూ.80 లు చెబుతున్నారు మార్కెట్లో. గోడౌన్ నిండా సరుకుంది. ఇంకా పెరిగేలా ఉందని మార్కెట్‌కి తక్కువ మొత్తంలో తరలిస్తున్నాడు. ఒకటి రెండు కాదు.. మొత్తం 8 లక్షల రూపాయల సరుకుంది.

తక్కువ రేటు ఉన్నప్పుడు కొని గోడౌన్‌లో దాచుకుంటే దొంగ వెధవ కన్ను పడనే పడింది. తెల్లారిపాటికి శుభ్రంగా సరుకు మొత్తం ఖాళీ చేసాడు. పగలు నలుగురు వ్యక్తులు వచ్చి మొత్తం పరికించారు. రేటు మాట్లాడుకున్నారు. మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు. అంతే ఇలా అర్థరాత్రి వచ్చి దోచుకుపోతారని అస్సలు ఊహించలేదు. ఉన్న ఇద్దరు నైట్ వాచ్‌మెన్‌లు చెట్టుకి కట్టేసి సరుకంతా ట్రక్కుల్లో తరలిచేశారని కన్నీళ్లొత్తుకుంటున్నాడు ఉల్లిపాయల వ్యాపారి. పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకున్నారు. గోడౌన్‌కు వచ్చి పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Tags

Next Story