ఐసీసీ కంటే ముందే బౌండరీ రూల్‌ను మార్చేసిన..

ఐసీసీ బౌండరీ రూల్ మారబోతోంది. బౌండరీ రూల్ స్థానంలో సూపర్ ఓవర్‌ను పొడిగించనున్నారు. మ్యాచ్ టై ఐతే విజేతను తేల్చడానికి మరికొన్ని ఓవర్లు ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. ఇప్పటి వరకు సూపర్ ఓవర్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వాళ్లనే గెలిచినట్లు ప్రకటించేవారు. సూపర్ ఓవర్‌లో కూడా పరుగులు సమానంగా వస్తే బౌండరీల ఆధారంగా విన్నర్‌ను తేల్చేవారు. ఈ బౌండరీ రూల్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బౌండరీ రూల్ మార్చి, సూపర్ ఓవర్‌ను పొడిగించడంపై త్వరలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐతే, ఐసీసీ కంటే ముందుగానే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసేసుకుంది. బౌండరీ రూల్‌ను సీఏ మార్చేసింది. ఆసీస్‌లో నిర్వహించే ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ లేటెస్ట్ సీజన్‌లో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.
ఇటీవలి వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌పై వివాదం చెలరేగింది. ఇంగ్లండ్-న్యూజీలాండ్ మధ్య జరిగిన తుది పోరులో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్‌లో పరుగులు సమం కావడంతో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లండ్ విజేతగా నిర్ణయించారు. ఈ రూల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సిక్సర్ కంటే బౌండరీకే విలువ ఎక్కువా, ఇదేం పద్దతి అని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు మండిపడ్డారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో బౌండరీ రూల్‌ను మార్చడంపై ఐసీసీ దృష్టి సారించింది.
Also watch :
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com