రోజుకో గుడ్డు.. మీ అందం, ఆరోగ్యం గుడ్

X
By - TV5 Telugu |25 Sept 2019 4:32 PM IST
గుడ్డు నాన్ వెజ్ కదా.. మేము తినము అని అనకండి. అందరూ హాయిగా తినొచ్చు. ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావలసిన విటమిన్-ఎని గుడ్డు అందిస్తుంది. శరీరం బలహీనంగా ఉంటే రోజుకో ఉడకబెట్టిన గుడ్డు తినమని డాక్టర్లు చెబుతుంటారు. విటమిన్ ఏ కాలేయం, చేపలు, రొయ్యల్లో అధికంగా ఉంటుంది. ఇంకా పాలు, పాలపదార్థాల్లో కూడా సమృద్ధిగా లభిస్తుంది. క్యారెట్, చిలకడదుంప, ఆకుకూరలు, టొమాటో, క్యాప్సికం, బొప్పాయి, గుమ్మడి ఇలా ఆయా సీజన్లలో దొరికే తాజా పండ్లు తీసుకున్నా విటమిన్ ఎ శరీరానికి అందుతుంది. ఉడకబెట్టిన గుడ్డులో ఎ విటమిన్‌తో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు లభిస్తాయి. రోజుకి ఒక గుడ్డు తినడం అలవాటు చేసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com