నాలాలో పడి కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు

నాలాలో పడి కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు
X

హైదరాబాద్‌ను ఎప్పుడు వర్షం మంచెత్తితే నాలలు ప్రాణాలు తీస్తున్నాయి.. వాన భయానికి తోడు నాలలు నోర్లు తెరుస్తున్నాయి. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి నాగోల్‌లోని ఓ నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు.. అందులో ప్రేమ్‌ కుమార్‌ అనే వ్యక్తి మృతి చెందగా.. సురేష్ అనే వ్యక్తి తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు...

ఓ వైపు భారీ వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ నాలో ఉందో తెలియని పరిస్థితి. రాత్రి కురిసిన భారీ వర్షంతో.. చాలాచోట్ల నాలలు తెరుచుకున్నాయి.. భారీగా నీరు ప్రవహిస్తుండడంతో అక్కడ నాల ఉందని తెలియక అటు వెళ్లిన సురేష్, ప్రేమ్ కుమార్ లు ఆ నాలాలో పడిపోయారు. విషయం తెలుసుకుని ghmc సిబ్బంది.. వారి కోసం చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ్ కుమార్ స్పాట్ లో చనిపోయాడు.. సురేష్ అనే వ్యక్తి గాయలతో బయటపడ్డాడు..

ఎప్పుడు వర్షం పడినా హైదరాబాద్ లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నాలాలు నోర్లు తెరుస్తున్నాయి.. మృత్యు దారులుగా మారుతున్నాయి. వర్షాలు పడకుముందు నాలాలు తెరిచిన మున్సిపల్ సిబ్బంది.. వాటిని కప్పడం మరిచిపోతున్నారు.. పైన మూతలా పెట్టి వదిలేస్తున్నారు. దీంతో భారీ వర్షాలు పడితే ఆ మూతలు కొట్టుకుపోయి.. నాలాలు ప్రాణాలు తీస్తున్నాయి.

Tags

Next Story