హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40,000

హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40,000

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL విశాఖ రిఫైనరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెయింటినెన్స్ టెక్నీషియన్, ల్యాబ్ అనలిస్ట్ వంటి వివిధ పోస్టుల్ని భర్తీ చేస్తోంది హెచ్‌పీసీఎల్. ఇందులో మొత్తం 36 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఆసక్తిగల అభ్యర్థులు hindustanpetroleum.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి 9 నెలలు ప్రొబెషనరీ పీరియడ్ ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 36.. మెయింటినెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 08, మెయింటినెన్స్ టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 05, మెయింటినెన్స్ టెక్నీషియన్ (మెకానికల్): 07, ల్యాబ్ అనలిస్ట్: 04, జూనియర్ ఫైర్ & సేప్టీ ఇన్‌స్పెక్టర్: 12.. దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 1.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30.. విద్యార్హతలు: మెయింటినెన్స్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా, ల్యాబ్ అనలిస్ట్ పోస్టుకు బీఎస్సీ (కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్), ఎంఎస్సీ కెమిస్ట్రీ 60% మార్కులతో పాస్ కావాలి. జూనియర్ ఫైర్ & సేప్టీ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు HMV లైసెన్స్ కలిగి ఉండాలి. వేతనం: రూ.40,000.

Tags

Read MoreRead Less
Next Story