మేరా దోస్త్ మహాన్.. మేకపై దర్జాగా మంకీ

మేరా దోస్త్ మహాన్.. మేకపై దర్జాగా మంకీ
X

ఎప్పుడూ చెట్లూ, పుట్టలు ఎక్కి దూకడం భలే బోరుగా ఉంది. చెంగు చెంగున ఎగిరే మేకతో చెలిమి ఎంతో బావుంది అంటూ మేక మీద ఎక్కి కూర్చుంది ఓ వానరం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో ఓ అరుదైన దృశ్యం మేకల యజమాని కంట పడింది. వారం పది రోజులుగా మేక, కోతి స్నేహాన్ని గమనిస్తున్నాడు. బుచ్చిరెడ్డి పాలెం మండలంలోని జొన్నవాడకు చెందిన వెంకటరమణయ్యకు మేకలు ఉన్నాయి. వాటిని తీసుకుని సమీపంలోని పెన్నానది ప్రాంతానికి వెళుతుంటాడు మేత కోసం. నది సమీపంలో జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కోతులు సంచరిస్తుంటాయి. అయితే అందులోని ఓ కోతి మేకల గుంపులోని ఓ మేక మీద ఎక్కి తిరుగుతోంది. గత జన్మలో మేమిద్దరం స్నేహితులం. ఈ జన్మలో కూడా అదే కంటిన్యూ చేద్దామని ఇలా అన్నట్టు ఉంది వీటి స్నేహం. ఈ మధ్య వానరానికి ఓ బుజ్జి పిల్ల పుట్టింది. దాన్ని కూడా తీసుకుని మేక మీద ఎక్కి షికార్లు కొడుతోంది. మేక కూడా స్నేహంలోని మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తోంది. మే.. మే అంటూ మిగిలిన మేకలకు పరిచయం చేస్తోంది తన కొత్త స్నేహితురాలిని.

Tags

Next Story