అంతర్జాతీయం

అబ్బాయితో మోదీ, ట్రంప్‌ సెల్ఫీ.. వీడియో వైరల్

అబ్బాయితో మోదీ, ట్రంప్‌ సెల్ఫీ.. వీడియో వైరల్
X

ఓ అబ్బాయితో మోదీ, ట్రంప్‌ల సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. మోస్ట్ పవర్‌పుల్ సెల్ఫీ అని ట్విట్టర్‌ అభివర్ణించింది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. PMO పోస్ట్‌ చేసిన వెంటనే కేంద్ర మంత్రులు ఆ సెల్ఫీ వీడియోను షేర్‌ చేశారు. నెటిజన్లు కూడా షేర్ల మీద షేర్లు చేయడంతో ఆ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.

హౌడీ మోదీ మీటింగ్‌కు మోదీ, ట్రంప్‌లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. సభా వేదికపైకి ట్రంప్‌ను మోదీ స్వయంగా తీసుకెళ్లారు. స్టేజ్‌పైకి వెళ్తుండగా భారతీయ బృందం మోదీ, ట్రంప్‌లకు స్వాగతం చెప్పింది. ఈ సందర్భంగా వెల్కమ్‌ టీమ్‌లోని ఓ అబ్బాయికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. సెల్ఫీ తీసుకుంటా నని ఆ అబ్బాయి, మోదీ-ట్రంప్‌లను అడిగాడు. అందుకు వారిద్దరూ వెంటనే ఓకే చెప్పారు. దాంతో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు చెందిన ఇద్దరు అధి నేతలతో సెల్ఫీ తీసుకునే భాగ్యం ఆ అబ్బాయికి లభించింది. ఇది తనకు లైఫ్‌టైమ్ సెల్ఫీ అని ఆ అబ్బాయి సంతోషం వ్యక్తం చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

Also watch :

Next Story

RELATED STORIES