హాస్య నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

హాస్య నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

టాలీవుడ్ హాస్య నటుడు వేణుమాధవ్‌ కన్నుమూశారు. గతకొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 6న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరిన వేణుమాధవ్ కు కొద్దిరోజులుగా డయాలసిస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.

వేణుమాధవ్ మరణవార్త తెలుసుకున్న సినీ నటులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. కాగా నల్గొండలో పుట్టిన వేణుమాధవ్.. కోదాడ లో పెరిగారు. ఆయన తండ్రి టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ఆఫీసర్. చదువంతా కోదాడలోనే సాగింది. ఓ వేదికపైన ప్రదర్శన ఇచ్చాడు వేణుమాధవ్. ఆది చూసిన అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డిలు సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా సాంప్రదాయం. లక్ష్మి సినిమాతో అవార్డును అందుకున్నారు. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story