వేణుమాధవ్ ఫస్ట్ మూవీ..

వెండితెరపై నవ్వులు పంచడం అంత సులువు కాదు. మాటలు రాసిన వాళ్లు ఎవరైనా దాన్ని ఓన్ చేసుకుంటూ తమకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకుంటే కానీ వారి హాస్యం పండదు. నవ్వులు పంచడంలో తమ ముద్రను ప్రత్యేకంగా వేసిన వాళ్లే పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అలాంటి వారిలో వేణుమాధవ్ ఒకరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి ఆపై ఎన్నో సినిమాలను తన హాస్యంతో నిలబెట్టిన ప్రతిభ అతని సొంతం. మిమిక్రీ ఆర్టిస్ట్ గా, వెంట్రిలాక్విస్ట్ గా మొదలైన వేణు మాధవ్ కళా ప్రస్థానం.. హీరోగా మారి నిర్మాతగా ఎదిగేంత వరకూ వచ్చిందంటే అదంతా స్వయంకృషే. అలాంటి వేణు మాధవ్ ఇలా చిన్న వయసులోనే కన్నుమూయడం పరిశ్రమతో పాటు ఎందరో హాస్యాభిమానుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
వేణుమాధవ్.. అతిశయోక్తులు పోయినా.. అమాయకత్వం చూపినా.. అతి తెలివిగా ప్రవర్తించినా.. అన్నిట్లోనూ ఓ వైవిధ్యమైన హాస్యాన్ని పంచిన కమెడియన్. వేణు పరిశ్రమకు వచ్చే టైమ్ కు తెలుగులో హాస్యనటులు అశేషంగా ఉన్నారు. అయినా అందరిలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తన ముద్రను బలంగా వేశాడు. అందుకే హాస్య నటుడుగా ఎలాంటి పాత్ర వచ్చినా సై అంటూ దూసుకుపోయాడు. సంప్రదాయం సినిమాతో వచ్చి సంప్రదాయ హాస్యంతో పాటు తనదైన మేనరిజమ్స్ ను సెట్ చేసుకున్నాడు వేణుమాధవ్.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com