ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో కట్టుకట్టినట్లుంది : నారా లోకేశ్

పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఘాటుగా స్పందించారు. ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో కట్టుకట్టినట్లుంది మీ తెలివి అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టులో తగ్గించి, ఎలక్ట్రికల్ బస్పుల్లో పదింతలు పెంచిన లాజిక్.. రివర్స్ టెండరింగ్ వెనకున్న అసలైన మ్యాజిక్కని సామాన్య ప్రజలకు కూడా అర్ధమైంది తుగ్లక్ ముఖ్యమంత్రి గారూ అంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ సెటైర్లు వేశారు. పోలవరం వంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును కేవలం స్వప్రయోజాల కోసం ఎటువంటి అనుభవం లేని కంపెనీకి అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమన్నారు. రివర్స్ టెండరింగ్‌లో భాగంగా ప్రాజెక్టుపైకి చైనా మేఘాలు కమ్ముకొస్తున్నాయి అంటూ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

