పదవతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు..

ఇండియన్ రైల్వేకు చెందిన నార్తర్న్ రైల్వేలో 118 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు న్యూ ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే కమర్షియల్ డిపార్ట్‌మెంట్ కేటరింగ్ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
ఖాళీలు: 118..
కమర్షియల్ డిపార్ట్‌మెంట్, కేటరింగ్ యూనిట్, సర్వీస్ సైడ్: 94 ఖాళీలు
కమర్షియల్ డిపార్ట్‌మెంట్, కేటరింగ్ యూనిట్, కుకింగ్ సైడ్: 24 ఖాళీలు
విద్యార్హతలు: అభ్యర్ధులు పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడులో ITI, Diploma పాసై ఉండాలి. దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు SC,ST అభ్యర్థులకు మాత్రం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 16, 2019.. దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 15, 2019.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com