నా జీవితంలో ఓ చేదు జ్ఞాపకం.. పార్టీలో ఓ అమ్మాయి.. : వరుణ్ తేజ్

నా జీవితంలో ఓ చేదు జ్ఞాపకం.. పార్టీలో ఓ అమ్మాయి.. : వరుణ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతూ గద్దలకొండ గణేష్ సినిమాతో మరో హిట్ కొట్టాడు వరుణ్ తేజ్. సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న వరుణ్‌ని మంచు లక్ష్మి 'ఫీట్ అప్ విత్ స్టార్స్' కోసం ఆసక్తికర సంభాషణను కొనసాగించింది. దాంతో వరుణ్ కూడా అంతే ఆసక్తిగా అభిమానులకు తనలో ఉన్న మరో కోణాన్ని పరిచయం చేసాడు. చిన్నప్పడు తన జీవితంలో జరిగిన స్వీట్ మెమరీస్‌ని గుర్తు చేసుకున్నాడు. కానీ వాటిని ఇప్పుడు తల్చుకుంటే ఒకింత భయం కలుగుతుందని అన్నాడు.

మొదటి ముద్దు ఎప్పుడు ఇచ్చావని మంచు లక్ష్మి అడగ్గా .. పదో తరగతిలో ఉన్నప్పుడు.. అది నాకో చేదు జ్ఞాపకం. దాని గురించి అంతకంటే ఇంక ఎక్కువ ఏమీ చెప్పలేను అని అన్నాడు. మరి మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలేమైనా ఉన్నాయా అంటే.. ఓ రోజు హైదరాబాద్‌లోని ఓ క్లబ్‌కి స్నేహితులతో కలిసి వెళ్లాను. పార్టీలో అందరం డ్యాన్స్ చేస్తుంటే ఒక అమ్మాయి వెనుక నుంచి వచ్చి నన్ను హగ్ చేసుకుంది. ఫ్రెండ్సే అలా పట్టుకున్నారని అనుకున్నాను. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకుని వెళ్లి పోయింది. ఆ క్షణం నాకు చాలా భయంగా అనిపించింది అని వరుణ్ మంచు లక్ష్మితో పంచుకున్నారు. మరి ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడిగితే.. ఇప్పటివరకు తనకెవరూ ప్రపోజ్ చేయలేదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story