డ్రైవర్ మద్యం తాగలేదంటూ.. మహిళ ఆత్మహత్యాయత్నం

డ్రైవర్ మద్యం తాగలేదంటూ.. మహిళ ఆత్మహత్యాయత్నం

గురువారం అర్ధరాత్రి చంపాపేట్ మినర్వా జంక్షన్ వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తమ కారు డ్రైవర్ మద్యం తాగకపోయినా.. అనవసరంగా ఆపి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించింది. అంతేకాదు.. నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో స్థానికులు అడ్డుకున్నారు.

హైదరాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉండే మునావత్ పద్మ, శ్రీను దంపతులు ఖమ్మం నుంచి వస్తున్నారు. చంపాపేట వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నారు. కారు ఆపి డ్రైవర్ కు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా.. పాజిటీవ్ వచ్చింది. దీంతో కేసు నమోదుచేశారు. అయితే తమ డ్రైవర్ మద్యం సేవించలేదని.. డబ్బుల కోసం పోలీసులు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ.. రోడ్డుపై పోలీసులో వాగ్వాదానికి దిగింది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story