వైసీపీలో దగ్గుబాటి కుటుంబానికి చెక్!

వైసీపీలో దగ్గుబాటి కుటుంబానికి చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. పర్చూరులో రావి రామనాథం బాబు తిరిగి YCPలో చేరారు. ప్రకాశం జిల్లా నేతలంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఎక్కడా కనిపించలేదు. పార్టీ నుంచి ఆయనకు దీనిపై సమాచారం కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. గతంలో YCPలోనే ఉన్న రావి రామనాథం అప్పుడు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
దగ్గుబాటి రాకతో అలిగిన YCPని వీడి ఎన్నికలకు ముందే TDPలో చేరారు. పర్చూరులో దగ్గుబాటి ఓటమికి ఇది కూడా ఓ కారణం. ప్రస్తుతం మారిన పరిణామాల నేపథ్యంలో మంత్రి బాలినేని సహా జిల్లా నేతలు రావిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీలో దగ్గుబాటిని దూరం పెట్టడానికి పురంధేశ్వరి తీరు కూడా కారణమన్న వాదన కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి ఘాటైన విమర్శలు చేస్తున్న నేపధ్యంలో దగ్గుబాటి కుటుంబాన్ని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాకే ఇలా చేసినట్టు సమాచారం. ఈ పరిణామాలపై దగ్గుబాటి ఆవేదన చెందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఓటమికి కారణమైన వ్యక్తిని చేర్చుకోవడం బట్టి చూస్తే.. ఇకపై దగ్గుబాటి YCPలో కొనసాగే అవకాశాలు లేనట్టేనని చెబుతున్నారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com