బాడి పాలిషింగ్ పార్లర్‌లోనే కాదు.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు.. ఈ విధంగా..

బాడి పాలిషింగ్ పార్లర్‌లోనే కాదు.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు.. ఈ విధంగా..
X

అవసరం.. తప్పదు కదా అని ఐబ్రోస్ కట్ చేయించుకోడానికి బ్యూటీ పార్లర్‌కి వెళితే మీ చర్మానికి టాన్ పట్టేసింది. బాడీ పాలిషింగ్ చేయించుకోండి. మీ స్కిన్ మెరిసిపోతుంది అని మనల్ని టెంప్ట్ చేస్తుంటారు. వారికి కొంత లాభం ఉన్నమాట నిజమే కానీ.. మనకి కూడా బాడీ పాలిషింగ్ వల్ల బోలెడు ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల చర్మం తేమగా ఉండడంతో పాటు, ఆరోగ్యంగానూ కనిపిస్తుంది. దీన్ని బ్యూటీపార్లలోనే కాదు.. స్కిన్ డాక్టర్స్ దగ్గర కూడా చేయించుకోవచ్చు. కొద్దిగా సమయం కేటాయిస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చు.

సాధారణంగా పాలిషింగ్ చేయాలంటే.. స్క్రబ్బింగ్, క్లెన్సింగ్, మసాజింగ్ విధానాలా ద్వారా చేస్తారు. చివరిగా గోరువెచ్చని నీటితో శుభ్రపరచి మాయిశ్చరైజర్ రాస్తారు. ముఖం మీది చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి బాడీ పాలిషింగ్ కేవలం శరీరానికే చేస్తారు. అలర్జీలు, ఇతర చర్మ సంబధిత సమస్యలు ఉన్నవారు, జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పాలిషింగ్ చేయించుకోకపోవడమే మంచిది.

ఈ బాడీ పాలిషింగ్‌ని సహజ పద్దతుల్లో ఇంట్లోనూ ప్రయత్నించవచ్చు.. వేడి నీటిలో టర్కీ టవల్‌ని ముంచి గట్టిగా పిండాలి. దాంతో ముందు ఒంటిని తుడుచుకోవాలి. ఆ తరువాత కొబ్బరినూనెతో కానీ ఆలివ్ ఆయిల్‌తో కానీ శరీరానికి మర్దనా చేసుకోవాలి. దాని తరువాత తేనె, పంచదార కలిపిన మిశ్రమాన్ని శరీరమంతటికీ పూతలా వేయాలి. ఓ అరగంట అలానే ఉంచి గోరు వెచ్చని నీటితో స్నానం చేసి బాడీ లోషన్ రాసుకోవాలి. బయటకు వెళ్లే ముందు రోజూ సన్ స్క్రీన్ లోషన్ రాసుకునే వెళ్లాలి. అప్పుడే టాన్ తగ్గి చర్మం అందంగా, ఆరోగ్యం ఉంటుంది. మిమ్మల్ని చూసిన వారు ఏంటి ఈ మధ్య మెరిసిపోతున్నారు అని అంటారేమో మరి.

Tags

Next Story