ఈ బైక్‌తో లాంగ్‌డ్రైవ్ చేస్తే ఆ కిక్కే వేరప్పా.. ఫీచర్లు చూస్తే..

ఈ బైక్‌తో లాంగ్‌డ్రైవ్ చేస్తే ఆ కిక్కే వేరప్పా.. ఫీచర్లు చూస్తే..

కేటీఎం డ్యూక్ 790 బైక్ ఎక్కి ఒక్క కిక్కు ఇచ్చారంటే రోడ్డు మీద రయ్ మంటూ దూసుకుపోవడమే. ఆకాశమే హద్దుగా.. గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే బైకుల్లో కేటీఎం ఒకటి. ఇండియాలో అడుగుపెట్టిన రోజు నుంచే అమ్మకాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. డ్యూక్ 790పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మోడల్‌ని కేటీఎం కంపెనీ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా చెబుతారు. ఎక్కడైనా దూసుకువెళ్లడానికి అనువుగా ఈ బైక్‌ని రూపొందించారు. ట్రెలీస్ ఫ్రేమ్‌తో రూపొందించడంతో అత్యంత దృఢంగా ఉంటుంది. పైగా తేలిగ్గానూ ఉంటుంది.

ఫీచర్లు.. అలాయ్ చక్రాలు, ముందు వెనుకా ఎల్‌ఈడీ లైట్లు, డిస్క్ బ్రేకులు, రెండు చక్రాలకూ మోటార్ స్టెబిలిటీ కంట్రోల్‌తో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఇచ్చారు. ఎంత వేగంలో ఉన్నా ఈ వాహనం బైకర్ నియంత్రణలో ఉంటుంది. స్పోర్ట్స్, స్ట్రీట్, రెయిన్, ట్రాక్ అని నాలుగు రైడింగ్ మోడ్‌లున్నాయి. ఇందులో ప్రత్యేకంగా స్టీరింగ్ డ్యాంపర్స్ అమర్చారు. సడెన్ బ్రేక్ వేసినప్పుడు బైకర్ క్రింద పడిపోకుండా ఈ స్టీరింగ్ డ్యాంపర్ కాపాడుతుంది. ఇంజిన్: 799సీసీ, లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్,. 8000 ఆర్‌పీఎం మీద 87 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 105 పీఎస్ భారీ పవర్ దీని సొంతం. మైలేజీ: 22.72కి.మీ/లీ బరువు: 169కేజీలు. ఇంధన ట్యాంకు సామర్థ్యం: 14 లీటర్లు. ధర: 8.5 లక్షలు (ఎక్స్ షోరూమ్).

Tags

Read MoreRead Less
Next Story