పవన్ కళ్యాణ్ మళ్లీ వస్తున్నాడు ..? దిల్ రాజు..

పవన్ కళ్యాణ్ మళ్లీ వస్తున్నాడు ..? దిల్ రాజు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా చేస్తున్నాడా.. ? అంటే అవుననే వినిపిస్తోంది. మొన్నటి వరకూ ఇక సినిమాలకు రాడు అనే ప్రచారం జరిగినా.. అటు పొలిటికల్ గా కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ లో కొంత సామాజిక సందేశం ఉన్న కొన్ని సినిమాలతో ప్రజలకు మరింత చేరువయ్యేలాంటి కథాంశాలు వస్తే చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఈ క్రమంలో ఓ మంచి కథతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. పైగా ఇది ఓ రీమేక్. పవన్ కు రీమేక్ లు బానే కలిసొస్తాయి. అంతేకాక ఇందులో నేటి సమాజంలోని అమ్మాయిలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ కు ఇది పర్ఫెక్ట్ మూవీ అవుతుందంటున్నారు.

ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..? పింక్.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కోర్ట్ డ్రామా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమాను తమిళంలో అజిత్ నీర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేసి విజయం సాధించాడు. ఈ చిత్రాన్నే తెలుగులో పవన్ తో రీమేక్ చేసేందుకు సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ప్రయత్నాలు చేస్తున్నాడు. దర్శకుడుగా క్రిష్ ను అనుకుంటున్నారట. అలాగే నిర్మాణంలో దిల్ రాజు కూడా భాగస్వామిగా ఉంటాడని సమాచారం. ఇక పవన్ ఊ అంటే చాలు.. ఇమ్మీడియొట్ గా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్న పవన్ ఇలాంటి కథతో వస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అంటున్నారు విశ్లేషకులు. మరి అతను ఈ సినిమాతో వస్తాడా లేక మరో సినిమాతోనా అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story