షాకింగ్.. ఏపీలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్‌ ధర.. రూ.30

షాకింగ్.. ఏపీలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్‌ ధర.. రూ.30
X

దసరా సెలవుల్లో బాదుడుకు సిద్ధమైంది రైల్వే శాఖ.. ఏపీలో పది రోజులకు పైగా దసరా సెలవులు రావడంతో.. అంతా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీని క్యాష్‌ చేసేకునేందుకు స్కెచ్‌ వేసింది రైల్వే శాఖ. ఫ్లాట్‌ఫాం టికెట్లను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం పది రూపాయలు ఉన్న ప్లాట్ ఫాం టికెట్‌ ధరను 30 రూపాయలకు పెంచేసింది.

విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు స్టేషన్లో అమలుకు సిద్ధమైంది. రేపటి నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు.. అంటే దసరా సెలవులు ముగిసే వరకు.. ఈ పెరిగిన ధరలకే ఫ్లాట్‌ ఫాం టికెట్లను విక్రయించనుంది.. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో.. రద్దీని నియంత్రించేందుకే రేట్లు పెంచామంటోంది రైల్వే శాఖ.

Tags

Next Story