మావోయిస్టు భవానీ కాళ్లలో రెండు బుల్లెట్లు

మావోయిస్టు భవానీ కాళ్లలో రెండు బుల్లెట్లు
X

విశాఖ జిల్లాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ గాయపడ్డ మావోయిస్ట్‌ నేత సాకె కళావతి, అలియాస్‌ భవానిని కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కాల్పుల్లో గాయపడ్డ ఆమెను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో గాయపడ్డ భవానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీ కాళ్లలో రెండు బుల్లెట్లు ఉన్నాయని.. ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. మీడియా కంట పడకుండా భవానిని రహస్యంగా తరలించారు పోలీసులు.

Tags

Next Story