హుజూర్ నగర్ బై పోల్‌లో టీడీపీ అభ్యర్థిగా..

హుజూర్ నగర్ బై పోల్‌లో టీడీపీ తరపున చావా కిర్మణయి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది టీడీపీ. సీనియర్ అయిన కిరణ్మయిని తమ అభ్యర్థిగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించి.. ఆమెకు బీఫామ్ అందచేశారు. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్టు.. ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని.. ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో చర్చించాక కిర్మణయి పోటీపై నిర్ణయం తీసుకున్నామన్నారు.
హుజూర్ నగర్ బై పోల్‌లో పోటీ చేయకపోతే పార్టీ మరింత కష్టాల్లోకి వెళ్లిపోతుందని ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. పార్టీని నమ్ముకున్న కేడర్‌లో నమ్మకం కలిగించాలంటే పోటీ చేయడమే సరైందని అధిష్టానం భావించిందన్నారు. సీనియర్ నేతలు, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని.. చివరకు కిరణ్మయిని తమ అభ్యర్థిగా ప్రకటించామన్నారు ఎల్ రమణ.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com