పరుగుల సునామీ సృష్టించిన మహిళా క్రికెటర్

బాదుడికి కేరాఫ్ ఆడ్రస్ అయిన గేల్‌ను వెనక్కు నెట్టేసింది. చిచ్చర పిడుగు సెహ్వాగ్‌ను మైమరపించింది. విజృంభణ అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తూ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. క్రీజ్‌లో పడ్డ ప్రతి బంతిని బౌండరీ దాటిస్తూ రికార్డుల మోత మోగిచింది ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్ అలీసా హీలీ. గతంలో ఆసీస్ ఉమెన్ క్రికెటర్ మెగ్ లానింగ్ చేసిన 133 పరుగులే అత్యధిక రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును హిలీ బ్రేక్ చేసింది.
అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది హీలీ. శ్రీలంకతో బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో హీలీ కేవలం 61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 148 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆ్రస్టేలియా మాజీ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ అలీసా హీలీ మేనకోడలు. శ్రీలంకపై ఆమె మెరుపుల కారణంగా ఆ్రస్టేలియా 132 పరుగుల ఘన విజయం సాధించింది.
ఇప్పటికే అలిసా హిలీ.. ఆస్ట్రేలియా పరుగుల మిషన్‌గా గుర్తింపు పొందింది. ఆమె కాసేపు క్రీజ్‌లో ఉన్న ప్రత్యర్థి ప్లేయర్లు మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంటున్నారు. మరోసారి అదే దూకుడతో శ్రీలంక ఉమెన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓడర్లలో 2 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. తరువాత శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 94 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 3-0తో ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది..
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com