నదిలో పడిపోయిన బీజేపీ ఎంపీ

నదిలో పడిపోయిన బీజేపీ ఎంపీ
X

బీహార్ రాజధాని పాట్నాలో వరద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన BJP ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారు. వెంటనే స్థానికులు ఆయన్ను కాపాడారు. పాటలీపుత్ర MPగా ఉన్న ఆయన.. తన నియోజకవర్గ పరిధిలోని వరద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. వరద ఉధృతి కారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వెదురుకర్రలు, ట్యూబ్‌లతో చేసిన తెప్పలాంటి దానిపై ఆయన ప్రయాణం చేశారు. ఆయనతోపాటు కొందరు బీజేపీ మద్దతుదారులు కూడా వెంట ఉన్నారు. మరికొన్ని అడుగుల దూరం వస్తే నది ఒడ్డుకు చేరుకుంటారనగా ఆ తెప్ప బోల్తాకొట్టింది. మాజీ కేంద్రమంత్రి, MP రామ్ కృపాల్ యాదవ్‌తోపాటు అంతా నీళ్లలో పడిపోయారు. వెంటనే ఆయన్ను కాపాడి పైకి తెచ్చినా కొద్ది సేపు స్ఫృహ కోల్పోయారు. స్థానికులు సపర్యలు చేశాక కోలుకున్నారు.

Next Story