డెంగ్యూతో పాటు మరికొన్ని వ్యాధులకు బొప్పాయి.. ఎక్కువ తింటే..

డెంగ్యూతో పాటు మరికొన్ని వ్యాధులకు బొప్పాయి.. ఎక్కువ తింటే..
X

బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్దాలు ఈ పండులో విరివిగా లభ్యమవుతాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం బారిన పడిన వారు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి బొప్పాయి పండు ఔషధంలా పని చేస్తుంది. బొప్పాయి ఆకుల రసాన్ని జ్యూస్ చేసుకుని తీసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయని పరిశోదనలో తేలింది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల చికిత్స తప్పనిసరి. బొప్పాయి తింటే కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను అరికట్టవచ్చు.

శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

గుండె సబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.

బొప్పాయిలో ఉండే బీటాకెరోటిన్, లూటిన్ వంటి యాంటీ ఆక్సిడెండ్లు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.

పొట్ట, పేగులలో చేరిన విషపదార్ధాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది.

కంటికి మంచిది. బీపీ, షుగర్ ఉన్నవారు బొప్పాయి తింటే చాలా ఉపయోగంగా ఉంటుంది.

నారింజ, యాపిల్ కంటే బొప్పాయిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.

చర్మం పొడిబారకుండా బొప్పాయి సహాయపడుతుంది.

బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలున్నాయి. వీటిని మెత్తగా దంచి పసుపుతో కలిపి పట్టువేస్తే బోధకాలు వాపు తగ్గుతుంది.

అయితే మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే అనర్థమే.. సీరియస్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు తినకూడదు. అధికంగా తింటే ఇందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల చర్మం రంగు మారుతుంది. దీనినే వైద్య పరిభాషలో కెరోటినిమా అని పిలుస్తారు. కొన్ని పరిస్థితుల్లో కళ్లు తెల్లగా మారుతాయి. చేతులు పచ్చగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కామెర్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. రోజుకి నాలుగైదు ముక్కలు, లేదా వారానికి రెండు మూడు సార్లు బొప్పాయి పండు తీసుకుంటే ఆరోగ్యం. అతిగా తీసుకుంటే అనర్థం.

Tags

Next Story