తొలిటెస్టులో విజృంభించిన భారత ఓపెనర్లు

తొలిటెస్టులో  విజృంభించిన భారత ఓపెనర్లు

సౌతాఫ్రికాతో విశాఖలో జరుగుతున్న తొలిటెస్టులో భారత ఓపెనర్లు విజృంభించారు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మొదట్లో ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో కుదురుకున్నాక వేగం పెంచారు. వీలుచిక్కినప్పుడల్లా బంతుల్ని బౌండరీలు దాటించారు.. లంచ్‌ తర్వాత ఈ జోడీ మరింత దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ, మాయంక్ అగర్వాల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. అయితే 59 ఓవర్లు పూర్తైన తర్వాత స్టేడియంలో దట్టంగా మేఘాలు అలుముకున్నాయి..దీంతో టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత భారీ వర్షం పడింది. దీంతో తొలిరోజు ఆట పూర్తైనట్లు ప్రకటించారు అంపైర్లు. తొలిరోజు మ్యాచ్ నిలిచిపోయే సరికి టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 115 రన్స్‌, మయాంక్ అగర్వాల్ 11 ఫోర్లు, 2 సిక్లర్లతో 84 పరుగులు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story