విశాఖ టెస్టులో సరికొత్త రికార్డు సృష్టించిన మయాంక్ అగర్వాల్

విశాఖ టెస్టులో సరికొత్త రికార్డు సృష్టించిన మయాంక్ అగర్వాల్

విశాఖ టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఇరగదీశాడు. డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఆడేది కేవలం ఐదో టెస్టే అయినా..ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపిగ్గా ఆడటమే కాదు.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల మోత మోగించాడు. సెంచరీపూర్తయిన తర్వాత మరింత దూకుడు పెంచాడు మయాంక్ . 215 రన్స్ చేసిన తర్వాతఎల్గర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇందులో 23 ఫోర్లు, 6 సిక్లర్లు ఉన్నాయి.. మయాంక్ కెరీర్‌లో ఇదే అత్యత్తమ స్కోరు.

దక్షిణాఫ్రికాపై ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అయితేరోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు..176 ర న్స్ చేసి ఔటయ్యాడు.ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన తొలి టెస్టులోనే డబుల్‌ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మహరాజ్‌ వేసిన 82 ఓవర్‌ ఆఖరి బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్‌ స్టంపింగ్‌ అయ్యాడు. దాంతో 317 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఆ తర్వాత వచ్చిన పుజారా, కెప్టెన్ కోహ్లీ, రెహానే, అనుమ విహారి, వృద్ధిమాన్ సాహా విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.

Tags

Read MoreRead Less
Next Story