రోడ్డుపై భారీ కొండచిలువ..

రోడ్డుపై భారీ కొండచిలువ..

మహబూబాబాద్‌లో రాత్రి ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. భారీ కొండచిలువ అటవీ ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి ప్రవేశించింది. ఫాతిమా హైస్కూల్ సమీపంలో రోడ్డుపై తిరుగుతున్న కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లొచ్చేలోపు దాన్ని పట్టుకునేందుకు కొందరు ట్రై చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరికి ఫారెస్ట్ సిబ్బంది వచ్చి జాగ్రత్తగా దాన్ని పట్టి గోనె సంచిలో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Read MoreRead Less
Next Story