'సైరా' నరసింహారెడ్డి తొలిరోజు కలెక్షన్లు అన్ని కోట్లా!

సైరా నరసింహారెడ్డి తొలిరోజు కలెక్షన్లు అన్ని కోట్లా!

మెగాస్టార్ చిరంజీవి సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా 'సైరా'. మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గాంధీజయంతి సందర్బంగా బుధవారం విడుదల అయింది. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే సినిమా ఆడుతోంది. నరసింహారెడ్డి పాత్రలో చిరు అదరగొట్టాడు. మెగాస్టార్ ను వీరోచిత పాత్రలో చూసి అభిమానులు త్రిల్ కు లోనవుతున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కలెక్ట్ చేస్తోంది.

తొలిరోజు దాదాపు రూ.85 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.38 కోట్లు, యూఎస్ లో 1 మిలియన్ దాటినట్టు సమాచారం. ఈ ఏడాది అతిపెద్ద మల్టీస్టారర్‌గా, బిగ్గెస్ట్‌ యాక్షన్‌ మూవీగా బుధవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వార్‌’ కూడా 'సైరా'పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. చిరు సినీ కెరీర్ లో ఇవే హైయస్ట్ ఓపెనింగ్స్. ఇదే ఊపును కొనసాగిస్తే లాంగ్ రన్ లో రూ.350 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story