కలియుగ వైకుంఠం తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కలియుగ వైకుంఠం తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. శ్రీవారి నామస్మరణతో శేషాచల కొండలు మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్నారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చెట్టు.. సృష్టిలోని వృక్షాలన్నింటిలోకి గొప్పది కల్ప వృక్షం.. అందుకే ఈ వాహన సేవలో స్వామివారిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

కామితార్థ ప్రదాయినిగా పేరున్న కల్పవృక్షానికి మన పురాణాలు, ఇతిహాసాల్లో ఓ విశిష్ట స్థానం ఉంది. రాక్షసులు, దేవతలు చేసిన క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్పవృక్షం ఒకటి. సృష్టిలోని వృక్షాలన్నిటిలోకి మేటిది కల్పవృక్షం. అలాంటి కల్పవృక్షాన్ని సైతం తన వాహనంగా చేసుకుని స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు.

Next Story