బాక్సాఫీస్‌పై ‘వార్’ దండయాత్ర.. సైరా దెబ్బకు తెలుగు, తమిళ్ లో..
హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్‌లో ఈ ఇద్దరు కూడా అగ్రహీరోలే. వాళ్ళకి అక్కడ యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. వాళ్లిద్దరూ ఆ కాంబినేషన్ వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'వార్' యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. విజువల్ వండర్ గా తెరపై 'వార్' అభిమానులకు కనువిందు చేస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన 'వార్'కు పాజిటివ్ రివ్యూలతోపాటు ఆడియెన్స్ టాక్ కూడా తోడవడంతో తొలిరోజు రికార్డుస్థాయిలో వసూళ్లను రాబట్టింది. సినిమా తొలి రోజు రూ. 53.35 కోట్లు షేర్ రాబట్టింది. కేవలం హిందీలో తొలిరోజు ఈ సినిమా 51.60 కోట్లు రాబట్టగా.. తమిళం, తెలుగు భాషల్లో రూ. 1.75 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా వార్ నిలిచింది. గతంలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన మల్టీస్టారర్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తొలిరోజు 52.50 కోట్లు వసూలు చేయగా.. ఆ రికార్డును వార్ చెరిపేసింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'సైరా'నరసింహారెడ్డి చిత్రం థియేటర్ లలో సందడి చేస్తోంది. ఈ సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో సైరా కు కూడా వసూళ్లు బాగానే వచ్చాయి. అయితే సైరా దెబ్బకు తెలుగు తమిళంలో వార్ కు కలెక్షన్లు తగ్గిపోయాయి. అయితేనేం బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది వార్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com