శంషాబాద్‌లో ఓ కామాంధుడికి 10ఏళ్ల జైలు శిక్ష

శంషాబాద్‌లో ఓ కామాంధుడికి 10ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టిన ఓ కామాంధుడిని న్యాయస్థానం కటకటాలకు నెట్టింది. ఐదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నింధితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ఎల్‌బీ నగర్‌ కోర్టు. జైలుతో పాటు 5వేల జరిమానా కూడా విధించింది. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడిన మృగానికి ఆలస్యంగానైనా తగిన శిక్షపడిందంటున్నారు బాధితులు.

రంగారెడ్డి జిల్లా బాలానగర్‌కు చెందిన నింధితుడు సయ్యద్‌ రఫీక్‌ కుటుంబసభ్యులతో శంషాబాద్‌లో ఉంటున్నాడు. 2015లో అహ్మద్‌నగర్‌ సాదత్‌కాలనీకి చెందిన ఓ మైనర్‌ బాలికను ప్రేమపేరుతో వంచించాడు. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు ఎల్‌బీ నగర్ మెట్రో పాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో నింధితుడిపై ఛార్జ్‌షీటు దాఖలుచేశారు. దాదాపు ఐదేళ్ల సుదీర్ష విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో రఫీక్‌కు 10ఏళ్ల జైలు శిక్షతో పాటు.. 5వేల జరిమానా విధించారు న్యాయమూర్తి.

Tags

Read MoreRead Less
Next Story