రెండోసారి తల్లి కాబోతున్న స్నేహ

రెండోసారి తల్లి కాబోతున్న స్నేహ

నటి స్నేహా రెండోసారి తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా ఇటీవల స్నేహా సీమంతం వేడుక జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు హాజరయ్యారు. సీమంతం వేడుక ఫోటోలను స్నేహా సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో.. ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 2012లో తమిళ హీరో ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు నిహాస్‌ ఉన్నాడు. వివాహం అయిన తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన స్నేహ.. ఓ బిడ్డకు జన్మినిచ్చారు. ఆ తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన సన్ అఫ్ సత్యమూర్తిలో నటించింది. అలాగే తెలుగు తమిళంలో మరికొన్ని సినిమాల్లో నటిస్తానని స్నేహ తెలిపిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story