ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

నీళ్లు, నిధులే ఎజెండాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్‌.. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ ఇప్పటికే రెండుసార్లు చర్చించారు. ఈ బృహత్తర ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు చేస్తుందని.. దీనికి కేంద్ర ఆర్థిక సహకారం అవసరమని ప్రధానిని కేసీఆర్‌ కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు పరిశీలనలో ఉన్న డ్యామ్‌ సేఫ్టీ బిల్లు, నదీ జలాల యాజమాన్య బిల్లు వచ్చే నెలలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందితే.. నదీజలాలతో పాటు దేశంలోని ఆనకట్టలన్నీ కేంద్రం పరిధిలోకి వస్తాయి. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మోదీ సహకారం కోరేందుకు సీఎం కేసీఆర్‌ ప్రధానితో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story