హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక.. కోటి 20 లక్షల రూపాయల పట్టివేత

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక.. కోటి 20 లక్షల రూపాయల పట్టివేత

సూర్యాపేట జిల్లా నెరేడుచర్ల మండలం చిల్లపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద ఒక కోటి 20 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని స్విఫ్ట్ డిజైర్‌ కారులో తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో నగదు బయటపడింది. అయితే ఈ డబ్బు ఆసరా పింఛన్లకు సంబంధించినదిగా పోలీసుల విచారణలో తేలింది.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక సందర్భంగా పోలీసులు 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేసి ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈసారి హుజూర్‌నగర్‌లో పాగా వేయాలని TRS ప్రయత్నిస్తుండగా, సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. మారిన పరిస్థితుల్లో బీజేపీ కూడా గెలుపుకోసం తీవ్రంగానే శ్రమిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story