విశాఖ టెస్టు.. క్రీజులో నిలబడేందుకు ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా!

విశాఖ టెస్టు.. క్రీజులో నిలబడేందుకు ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా!

విశాఖ టెస్టుపై టీమిండియా పట్టుబిగించింది. ఏడు వికెట్లకు 502 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది..భారత స్పిన్నర్లను ఎదుర్కునేందుకు సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడ్డారు. 14 రన్స్ వద్దే తొలి వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో క్రీజులో నిలబడేందుకు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. అశ్విన్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 463 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఇంకా 7 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

Also watch :

Read MoreRead Less
Next Story