ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి

ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి
X

కడప-బెంగళూరు ప్రధాన రహదారిలోని చిన్నమండెం మండలం కేశాపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఇండికా కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు.

కడపలో నివాసం ఉండే జగదీష్‌ కూతురు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. భార్యను ఆసుపత్రిలోనే వదిలి బంధువుల్ని తిరిగి కడపలో డ్రాప్‌ చేసేందుకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు మృత్యువాత పడ్డారు.

ఘటనాస్థలంలోనే ముగ్గురు చనిపోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. కూతురు వద్దకు వెళ్లిన తిరిగివస్తున్నవారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బంధువులు షాక్‌కు గురయ్యారు.

Tags

Next Story