త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న వైసీపీ ఎంపీ మాధవి

త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న వైసీపీ ఎంపీ మాధవి
X

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఆమె వివాహం ఈనెల 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ మాధవి సోదరులు వెల్లడించారు. తెల్లవారుజాము 3.15 గంటలకు అరకు మండలం శరభన్నపాలెంలో వివాహం, విశాఖపట్టణంలో రిసెప్షన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. కాగా 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున అరకు పార్లమెంటు నుంచి ఎంపీగా గెలుపొందారు మాధవి.

Tags

Next Story