బండ్ల గణేష్‌, పీవీపీ మధ్య వార్.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

బండ్ల గణేష్‌, పీవీపీ మధ్య వార్.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

బండ్ల గణేష్‌, పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) మధ్య ఆర్థిక వివాదం నెలకొంది. పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. బండ్ల గణేష్‌ తనకు 7 కోట్లు ఇవ్వాలని అడిగితే.. బెదిరింపులకు దిగుతున్నాడని పీవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్‌, అతని అనుచరులు శనివారం అర్థరాత్రి తన ఇంటికి వచ్చి.. హల్‌చల్‌ చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీంతో బండ్ల గణేష్‌, అతని అనుచరులపై 448, 506, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అటు పీవీపీ, ఆయన అనుచరులు డబ్బు కోసం తనను బెదిరిస్తున్నారంటూ బంజారాహిల్స్‌ పీఎస్‌లో పోటీగా ఫిర్యాదు చేశారు బండ్ల గణేష్‌.

Tags

Read MoreRead Less
Next Story