వైఎస్ హయాంలోనే యురేనియం ప్లాంటుకు అనుమతి : చంద్రబాబు

వైఎస్ హయాంలోనే యురేనియం ప్లాంటుకు అనుమతి : చంద్రబాబు
X

ఏపీలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల కేంద్రం నుంచి.. గాజులపల్లి వరకు యురేనియం కోసం తవ్వకాలు జరుపుతుంటే... ప్రభుత్వం తెలిసీ తెలియనట్లు ఉండటం ఏంటని ప్రశ్నించారు.. ప్రజల ఆందోళనను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నిలదీశారు చంద్రబాబు..

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి వైసీపీ నేతలు డుమ్మా కొట్టారంటే అర్థం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. ఆదివారం ఓబుళపల్లెలో జరిగే అఖిలపక్ష పోరాటానికి ప్రభుత్వ మద్దతు ఉందా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు..

వైఎస్ హయాంలో యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి నల్లమలకు ముప్పు తెచ్చారని..ఇప్పుడు జగన్ యురేనియం తవ్వకాల అంశంపై తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. ప్రజలు, రైతులకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

Tags

Next Story