ప్రేమజంటపై కత్తులు, గొడ్డళ్లతో దాడి

ప్రేమజంటపై కత్తులు, గొడ్డళ్లతో దాడి
X

చిత్తూరు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి యత్నించడం స్థానికంగా కలకలంరేపింది. ఏర్పేడు హరిజనవాడకు చెందిన మహేష్, గొల్లపల్లికి చెందిన స్నేహలు శనివారం పెళ్లి చేసుకున్నారు. స్నేహ కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టంలేదు. పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్నేహ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన స్నేహ కుటుంబ సభ్యులు మహేష్‌ ఇంటిపై దాడి చేశారు. మహేష్‌ ఇంట్లో ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. మహేష్‌, స్నేహలపై కత్తులతో దాడికి యత్నించారు. దాడిని అడ్డుకున్న మహేష్‌ బంధువులకు గాయాలయ్యాయి.

Tags

Next Story